గుండె గుభేల్.. ఇదేంట్రా బాబూ.. బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయ్
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350గా ఉంది.
- T Venkateshwarlu
- Published On : February 23, 2026 / 10:38 AM IST
భారత్‌లో ఇవాళ ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,47,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,550 పెరిగి రూ.1,21,010గా ఉంది.
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,500గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,48,050గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,550 పెరిగి రూ.1,21,160గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350గా ఉంది.
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,47,900గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,550 పెరిగి రూ.1,21,010గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,00,000గా ఉంది.
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.25,000 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.3,00,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.3,00,000గా ఉంది.
