గత మూడ్రోజుల క్రితం వరకు వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేట్లు.. బుధవారం కూడా భారీగా పెరిగాయి.
2/8
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.6,600 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.6,050 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు బంగారంపై 161 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 5,069 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/8
వెండి ధరలుసైతం భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 3.20లక్షలకు చేరింది.
4/8
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,47,150 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,60,530కు చేరింది.
5/8

6/8
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,47,300కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,60,680కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,47,150కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,60,530కు వద్దకు చేరింది.
7/8
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.20వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,20,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,20,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,20,000 వద్దకు చేరింది.
8/8
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.