బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వేలల్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.5,020 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.4,600 తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 30డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,899 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
3/7
వెండి రేటు కూడా భారీగా తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 20వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,550 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,420కు చేరింది.
5/7
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,700కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,570కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,550కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,420కు వద్దకు చేరింది.
6/7
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.20వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,00,000 వద్దకు చేరింది.
7/7
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.