Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత రెండుమూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు.. తాజాగా భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : February 7, 2026 / 11:27 AM IST
బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గత రెండుమూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు.. తాజాగా భారీగా పెరిగాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,890 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,650 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై భారీగా పెరుగుదల చోటు చేసుకుంది.
మరోవైపు.. వెండి రేటుసైతం పెరిగింది. గడిచిన రెండు రోజుల్లో (గురు, శుక్రవారాల్లో) కిలో వెండిపై రూ.40వేలు తగ్గగా.. తాజాగా.. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,550 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,600కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,700కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,56,750కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,550కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,500కు వద్దకు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,85,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,85,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
