Gold and Silver Rates Today : రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు.. కారణాలివే.. నేటి ధరలు ఇలా..
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేటు ఊహించని విధంగా పెరిగింది.
- Harishth Thanniru
- Published On : January 10, 2026 / 10:21 AM IST
సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
అంతర్జాతీయంగా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకుతోడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500శాతం సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలపడం, ఇతర అంశాల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం, వెండిపై ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దీంతో రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1150 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1050 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఔన్సు గోల్డ్ పై 57 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,509 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు.. వెండి ధరసైతం భారీగా పెరిగింది. గురు, శుక్రవారాల్లో కిలో వెండిపై రూ.9వేలు తగ్గగా.. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై ఏకంగా రూ. 7వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.3లక్షల మార్క్ వైపునకు దూసుకెళ్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,28,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,40,460కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,28,900కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,40,610కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,28,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,40,460కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,75,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
