Gold and Silver Rates Today : రాత్రికిరాత్రే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఎందుకిలా? నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : January 17, 2026 / 11:18 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. రెండ్రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన ధరల్లో రాత్రికిరాత్రే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 380 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. 23 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,596 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.4 వేలు తగ్గగా.. ఇవాళ (శనివారం) కిలో వెండిపై రూ.4వేలు పెరిగింది
గత ఏడాది అయితే పెట్టుబడిదారులకు పసిడి లాభాల పంట పండించింది. ఈ సంవత్సరం కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని పలు నివేదికలు వెలువడటంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్, వెండి రేటు భారీగా పెరుగుదలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,31,800 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,780కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,950కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,43,930కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,31,800 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,780కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,10,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,10,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
