Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.
- Harishth Thanniru
- Published On : January 18, 2026 / 07:12 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు స్వల్ప ఊరట. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో బంగారం , వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 23 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,596 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇవాళ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి కిలో వెండిపై భారీ పెరుగుదల చోటు చేసుకుంది. సుమారు రూ.42వేలు పెరుగుదల చోటు చేసుకుంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండి ధర తగ్గుముఖం పట్టడంతో దేశంలోనూ వెండి ధర స్వల్పంగా తగ్గే అవాకశం ఉంది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,31,800 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,780కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,950కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,43,930కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,31,800 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,43,780కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,10,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,10,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
