Gold and Silver Rates Today : డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. బంగారం, వెండి ధరల్లో రాత్రికిరాత్రే భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బంగారం ధర పెరగ్గా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- Harishth Thanniru
- Published On : January 21, 2026 / 10:57 AM IST
బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్దిరోజుల్లో వీటి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. యూరోపియన్ దేశాలపై సుంకాల విధింపుల హెచ్చరికలతో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధర ర్యాలీ కొనసాగుతోంది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 5,020 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 4,600 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ పై ఏకంగా 103 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,864 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కిలో వెండిపై సోమవారం రూ. 8వేలు, మంగళవారం రూ.22వేలు పెరిగి సరికొత్త రికార్డులను నమోదు చేసిన వెండి ధర.. బుధవారం స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,41,900కు చేరుకోగా.. 24క్యారట్ల ధర రూ.1,54,800కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,42,050కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,950కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,900కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,800కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,40,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,25,500 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,40,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
