Gold and Silver Rates Today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. వామ్మో.. 10 రోజుల్లో ఎంత పెరిగాయో తెలుసా? నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. కిలో వెండి రూ.4లక్షలు దాటగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది.
- Harishth Thanniru
- Published On : January 29, 2026 / 12:50 PM IST
బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వెండి రేటు రూ.4లక్షలు దాటగా.. బంగారంసైతం రూ.2లక్షల వైపునకు దూసుకెళ్తోంది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 11,770 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 10,800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 255 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 5,560 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఇవాళ రూ.25,000 పెరిగింది. అయితే, గడిచిన పది రోజుల నుండి వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కిలో వెండిపై పది రోజుల్లో ఏకంగా రూ.95వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,63,950 వద్ద కొనసాగుతుండగా.. 24క్యారట్ల ధర రూ.1,78,850 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,64,110కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,79,000కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,63,950కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,79,000కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.4,25,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.4,10,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 4,25,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
