Gold and Silver Rates Today : కుప్పకూలిన బంగారం ధరలు.. గంటల వ్యవధిలోనే రాత్రిరాత్రికే ఢమాల్.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. వీటి ధరలు భారీగా తగ్గాయి.
- Harishth Thanniru
- Published On : January 30, 2026 / 10:53 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. వీటి ధరలు భారీగా తగ్గాయి. రాత్రికిరాత్రే గోల్డ్, సిల్వర్ రేట్లలో పెద్దెత్తున మార్పులు చోటు చేసుకున్నాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.8,230 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.7,550 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 95 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 5,210 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర సైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై పది రోజుల్లో ఏకంగా రూ.95వేల పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా.. ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది.
మార్కెట్ల ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో బంగారం, వెండి మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా దాదాపు 8శాతం వరకు పడిపోవడం మార్కెట్లను షాక్‌కు గురిచేసింది. అయితే, ఆ తరువాత గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం లేదని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,56,400 వద్ద కొనసాగుతుండగా.. 24క్యారట్ల ధర రూ.1,70,620 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,550కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,70,770కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,56,400కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,70,620కు చేరింది.
ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.4,15,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,95,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 4,15,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
