Gold and silver price : బంగారం, వెండి ప్రియులకు భారీ శుభవార్త.. రాత్రికిరాత్రే ఢమాల్.. నేటి ధరలు ఇవే..
Gold and silver price : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి రేట్లు భారీగా తగ్గాయి.
- Harishth Thanniru
- Published On : January 3, 2026 / 10:53 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త.
శుక్రవారం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ (శనివారం) భారీగా తగ్గాయి.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామలు 24 క్యారట్ల బంగారంపై రూ.380 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.350 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 6 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరసైతం భారీగా తగ్గింది. సోమవారం నుంచి గురువారం వరకు కిలో వెండిపై రూ. 29వేలు తగ్గిన వెండి రేటు.. శుక్రవారం కిలో వెండిపై రూ. 4వేలు పెరిగింది.. అయితే ఇవాళ (శనివారం) రూ.4వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,24,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,35,820కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,650 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,35,970కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,24,500 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,820కు చేరింది.
వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,56,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,38,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,56,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
