Gold and Silver Rates Today : గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. వెండి వేగంగా..! నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : అంతర్జాతీయ చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారంసైతం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : January 5, 2026 / 10:25 AM IST
సంక్రాంతి పండుగకు బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్.
అంతర్జాతీయ చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారంసైతం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,580 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1,450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ పై 86 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4404 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
సోమవారం వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 8వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,25,950 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,37,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,26,100 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,37,550కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,25,950 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,37,400కు చేరింది.
వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,47,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
