Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!.. ఎందుకిలా..? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి ధరలు సామాన్యలకు అందని స్థాయికి చేరిపోయాయి.
- Harishth Thanniru
- Published On : January 6, 2026 / 10:17 AM IST
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ పండుగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోతోంది. బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్నాయి.
గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి ధరలు సామాన్యలకు అందని స్థాయికి చేరిపోయాయి. మంగళవారంసైతం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.600 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 550 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ పై 133 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4465 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మంగవారం వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 6వేలు పెరిగింది. దీంతో సోమ, మంగళవారాల్లో కలిపి కిలో వెండిపై రూ. 14వేలు పెరిగింది. ఫలితంగా కిలో వెండి ధర రూ.3లక్షల మార్క్ వైపు దూసుకెళ్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,27,250 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,38,820కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,400 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,38,970కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,27,820 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,38,820కు చేరింది.
వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,71,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,53,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,71,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
