Gold Silver Price Today : ఆహా భలే ఛాన్స్.. శ్రావణ శుక్రవారం రోజు బంగారం రేట్లు ఢమాల్.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా? వెండి కూడా..

Gold Silver Price Today : శ్రవణ శుక్రవారం రోజు బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు ఇవాళ భారీగా తగ్గాయి.

1/7
Gold Silver Price Today : శ్రవణ మాసం ప్రారంభమైంది. శుభ ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో బంగారం కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే, కొద్దిరోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రస్తుతం వారికి అదిరిపోయే శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
2/7
గురువారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.1260 తగ్గగా.. ఇవాళ (శుక్రవారం) కూడా గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది.
3/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 650 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,320 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది. శ్రావణ శుక్రవారం రోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుకు సిద్ధమవుతున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,890 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,040 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,170కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,40,400 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు