Gold Rates Today : పండుగ వేళ బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్.. రూ.5వేలు తగ్గిన వెండి.. ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ రేట్లు ఇవే..!

Gold Rates Today : అక్టోబర్ 15న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు, వెండి ధరలివే..

1/7
Gold Rates Today : బంగారం ప్రియులకు పండగే.. గోల్డ్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు వరుసగా పతనమవుతున్నాయి. పండుగల వేళ ధరలు తగ్గడం కొనుగోలుదారుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
2/7
అక్టోబర్ 15, (గురువారం) బులియన్ మార్కెట్లో పసిడి ధరలు రాత్రికి రాత్రే దిగివచ్చాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆభరణాలు కొనేందుకు చూస్తుంటే ప్రస్తుత బంగారం, వెండి ధరలపై ఓసారి లుక్కేయండి..
3/7
హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఇలా : హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,47,440కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,35,150 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. బంగారం కొనేముందు బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం బెటర్..
4/7
ఢిల్లీలోనూ తగ్గిన పసిడి ధరలు : దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.820 తగ్గి రూ.1,47,590కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,35,300 వద్ద కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు మార్కెట్లలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,440గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,150గా ట్రేడ్ అవుతోంది.
5/7
వెండి ధరలు భారీ పతనం : బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు భారీగా ఊరటనిస్తున్నాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ.5వేలు తగ్గింది. బుధవారం రూ.2.35 లక్షలుగా ఉన్న వెండి ధర ఈ రోజు (గురువారం) రూ.2.30 లక్షలకు చేరింది.
6/7
హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర రూ.5వేలకు పడిపోయింది. బుధవారం రూ.2.45 లక్షలున్న వెండి ధర ప్రస్తుతం రూ.2.40 లక్షలకు తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.40 లక్షలుగా ఉంది.
7/7
కొనుగోలుదారులకు పండగే : పండుగల సమయంలో బంగారం, వెండి, ఆభరణాల ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అయితే, మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు మారవచ్చు. జీఎస్‌టీ, మేకింగ్ ఛార్జీలు కలిపితే ఫైనల్ గోల్డ్ ధర మారుతుంది. కొనుగోలు చేసే ముందు లోకల్ నగల దుకాణంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లను చెక్ చేయడం బెటర్..