Gold And Silver Rates Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. కొనుగోలుదారులకు అలర్ట్..

Gold And Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా. ఇవాళ గోల్డ్ రేటులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

1/7
Gold And Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. సోమ, మంగళవారాల్లో భారీగా తగ్గిన బంగారం ధర.. బుధవారం మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగానే గోల్డ్ రేటులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, వచ్చే రెండుమూడు వారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
2/7
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,326 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
3/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,440 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,650 వద్ద కొనసాగుతోంది.
4/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,590 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,440కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,40,650 వద్ద కొనసాగుతోంది.
5/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
6/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
7/7