Gold Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. తులం ధర ఎంతంటే?

Gold Silver Price Today : బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి.

1/6
2/6
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 920 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,350 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఇవాళ తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,970 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,120 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,200 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,970కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,45,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.