Gold And Silver Prices Today : బంగారం ధరలో భారీ మార్పు.. ఈరోజు 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే!
Gold And Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. వరుసగా రెండోరోజు గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- September 19, 2026 / 10:32 AM IST
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలో గోల్డ్ రేటు రాకెట్ వేగంతో దూసుకెళ్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. శుక్రవారం బంగారం ధర భారీ పెరగ్గా.. శనివారం కూడా అదే బాటలో పయణించింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1420 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1300 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.3వేలు పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,350 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది. శుక్రవారం కూడా కిలో వెండిపై రూ. 5వేలు పెరగ్గా.. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 10వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,990 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
