Gold-Silver Prices Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే..
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న అలర్ట్. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- September 20, 2026 / 10:51 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? కొద్దిరోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. శుక్ర, శనివారాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 3వేలు పెరిగింది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,350 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,990 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
