Gold Silver Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న అలర్ట్. ఇవాళ గోల్డ్ రేటు పెరిగింది.
- Harish Thanniru
- Updated on- July 31, 2026 / 12:02 PM IST
Gold Silver Price Today : బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. గత వారం తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వచ్చే వారం రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరగ్గా.. 22క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 28డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సుగోల్డ్ రేటు 4,075 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,600 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,750 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,700 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,600కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
