Gold Silver Price Today : ఇక గోల్డ్ కొనలేమా? బాబోయ్ ఇదేం దూకుడు.. నేడు తులం బంగారం ధర ఎంతో తెలుసా..

Gold Silver Price Today : బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. గురు, శుక్రవారాల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ (శనివారం) కూడా భారీగా పెరిగింది.

1/7
మధ్య తరగతి వర్గాల ప్రజలకు బంగారం అందని ద్రాక్షగా మారే పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా గోల్డ్ దూకుడు చూస్తుంటే.. ఇక గోల్డ్ కొనలేమా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
2/7
శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ. 1520 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు రూ.8వేలు పెరిగింది.
3/7
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు దూకుడు తగ్గడం లేదు. తాజాగా.. ఔన్సు గోల్డ్ పై 92డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ గోల్డ్ రేటు 4,607 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,49,500 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,62,240 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,49,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,090కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,49,500 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,60,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.