Gold-Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. నేటి ధరల్లో భారీ మార్పులు.. కారణాలివే..
Gold-Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. సిల్వర్ ధర స్థిరంగా కొనసాగుతోంది.
- Harish Thanniru
- Updated on- September 23, 2026 / 09:56 AM IST
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉధ్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సోమ, మంగళవారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గగా.. ఇవాళ (బుధవారం) భారీగా పెరిగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.870 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,345 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,350 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,41,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,200కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు
