Gold Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి కాస్త ఊరట కలిగించే వార్త.
- Harish Thanniru
- Published on- August 26, 2026 / 11:07 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి కాస్త ఊరట కలిగించే వార్త. గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్‌పై 15డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేటు 4,642 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,63,750 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,50,100 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,900 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,750కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,50,100 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,60,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
