Gold Silver Price Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది.. గురువారం భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ (శుక్రవారం) కూడా అదే దూకుడును కొనసాగించింది.
- Harish Thanniru
- Published on- September 4, 2026 / 10:25 AM IST
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి షాకింగ్ న్యూస్. గురువారం రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ (శుక్రవారం) కూడా భారీగా పెరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1310 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1200 పెరిగింది. గురు, శుక్రవారాల్లో కలిపి తులం బంగారంపై సుమారు రూ. 4500 పెరుగుదల చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,474 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గురువారం కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. ఇవాళ (శుక్రవారం) వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,600 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,600 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,810 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,660కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,43,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
