Gold And Silver Price Today : బంగారం ప్రియులకు బిగ్ అప్డేట్.. గోల్డ్ ధరల్లో భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..

Gold And Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది.

1/6
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ఊరటనిచ్చే వార్త. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది. శుక్ర, శనివారాల్లో భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఈనెలాఖరు నాటికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2/6
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,607 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరసైతం స్థిరంగా కొనసాగుతోంది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,800 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,900 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,950 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,670కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,43,610 వద్ద కొనసాగుతోంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.