Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold Silver Price Today : బంగారం ధర మళ్లీ పెరిగింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేటు ఇవాళ కూడా పెరిగింది. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
- Harish Thanniru
- Published on- August 7, 2026 / 10:23 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు వరుసగా మూడోరోజు పెరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 160 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో 24క్యారెట్ల బంగారంపై సుమారు రూ.600 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. శుక్రవారం ఔన్స్ గోల్డ్ పై 23డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ రేటు 4,262 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. బుధ, గురువారాల్లో భారీగా పెరిగిన వెండి ధర.. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,890 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,37,400 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,50,040 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,37,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
