Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today :బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : April 10, 2026 / 11:30 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నావారికి గోల్డ్, సిల్వర్ ధరలు మరోసారి షాకిచ్చాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఇవాళ భారీగా పెరిగాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1520 పెరగ్గా.. 22క్యారెట్ల బంగారంపై రూ. 1400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 3.58 డాలర్ల పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,776 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ. 5వేలు తగ్గగా.. ఇవాళ కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,000కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,250 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,150కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,400 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,000కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,40,250 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలో ఇవాళ భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
