Gold Price Today : ట్రంప్ బిగ్ డెసిషన్.. గోల్డ్, సిల్వర్ రేట్లు ఢమాల్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇవాళ వీటి ధరలు తగ్గాయి.

1/8
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ఊరట. బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గగా.. వెండి రేటు భారీగా తగ్గుదల చోటుచేసుకుంది.
2/8
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో గోల్డ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల మొదటి వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది.
3/8
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 380 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 33డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,718డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరలో సైతం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,750 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,610కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,750 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.