Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Price Today : అంతర్జాతీయంగా నెలకొన్న ఉధ్రిక్తతల నేపథ్యంలో ఇవాళ బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published On : April 3, 2026 / 10:48 AM IST
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతోపాటు.. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.1,960 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1,800 పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సు బంగారంపై 109 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,676 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఉదయం నమోదైన వివరాల ప్రకారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గురువారం కిలో వెండిపై రూ. 10వేలు తగ్గగా.. ఇవాళ వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,080 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,50,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,38,350 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
