Gold Price Today April 7: బంగారం ప్రియులకు ఎగిరిగంతేసే శుభవార్త.. గంటల వ్యవధిలోనే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలుచేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

1/8
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు శుభవార్త. వీటి ధరలు భారీగా తగ్గాయి.
2/8
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పుల కారణంగా కొద్దిరోజులుగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా.. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఇవాళ (మంగళవారం)సైతం గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై ఆరు డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,657 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,59,840కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,37,350 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,990కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,37,350 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధరలో ఇవాళ భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.