Gold Rate Today : కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఊహించని స్థాయిలో తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు గురువారం భారీగా తగ్గాయి.
- Harishth Thanniru
- Published On : April 9, 2026 / 10:54 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. బుధవారం భారీగా పెరిగిన వీటి ధరలు.. ఇవాళ (గురువారం) భారీగా తగ్గాయి.
పశ్చిమాసియాలో ఉధ్రిక్తతల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో బుధవారం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరగ్గా.. తాజాగా.. ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడుల తరువాత గురువారం గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.2,340 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,715 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరసైతం భారీగా తగ్గింది. బుధవారం భారీగా పెరిగిన వెండి రేటు.. ఇవాళ (గురువారం) భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,850 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,630కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,480కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,38,850 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలో ఇవాళ భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
