Gold Price Today May 20 : తగ్గేదేలే అంటున్న గోల్డ్.. రాత్రికి రాత్రే పెరిగిన బంగారం.. హైదరాబాద్, విజయవాడలో కొత్త ధరలు షాక్!

Gold Price Today May 20 : బంగారం కొనేందుకు చూస్తున్నారా? గోల్డ ఇప్పుడు కొనకపోవడమే బెటర్. బంగారం ధరల్లో రాత్రికి రాత్రే భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి.. ఈరోజు తులం బంగారం ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు..

1/8
Gold Price Today May 20 : బంగారం తగ్గనట్టే తగ్గనంటోంది. రోజురోజుకీ బంగారం పెరుగుతుంది తప్ప అసలు తగ్గడం లేదు. బంగారం ప్రియులకు కొనేందుకు ఇది సరైన సమయం కాదనే చెప్పాలి. నిన్న వందల్లో పెరిగిన బంగారం ఈరోజు ఏకంగా తులం రేటు రూ.1,310 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
2/8
దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు (మే 20, బుధవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. గోల్డ్ ధరలు 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.131 పెరిగింది. ఆపై రూ.15,835 వద్ద కొనసాగుతోంది. అలాగే, 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.120 పెరిగింది. ఆపై రూ.14,515 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/8
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలివే : హైదరాబాద్ సిటీలో బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,310 పెరిగింది. ఆపై రూ.1,58,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1200 పెరిగింది. ఆపై రూ.1,45,150 ధర పలుకుతోంది.
4/8
విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,310 పెరిగింది. ఆపై రూ.1,58,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1200 పెరిగింది. ఆపై రూ.1,45,150 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
5/8
విశాఖలో బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,310 పెరిగింది. ఆపై రూ.1,58,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1200 పెరిగి ఆపై రూ.1,45,150 వద్ద ట్రేడ్ అవుతోంది.
6/8
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,58,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,300 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,310 పెరిగింది. ఆపై రూ.1,58,350 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1200 పెరిగింది. ఆపై రూ.1,45,150 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
7/8
చెన్నైలో ఈరోజు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,62,230 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,48,710 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో పసిడి ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,310 పెరిగింది. ఆపై రూ.1,58,350 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1200 పెరిగింది. ఆపై రూ.1,45,150 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
8/8
వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 15వేలు తగ్గి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.2,85,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 5వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది.