Gold Price Today May 28 : పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్! రాత్రికి రాత్రే కుప్పకూలిన తులం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే?

Gold Price Today May 28 : బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గోల్డ్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం బంగారం ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..

1/9
Gold Price Today May 28 : బంగారం కొనేవారికి ఎగిరిగంతేసే వార్త.. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. రాత్రికి రాత్రే మార్పులతో గోల్డ్ మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధరలు రూ.2 వేలపైగా దిగొచ్చాయి. బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.
2/9
అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో గోల్డ్ మార్కెట్లో బంగారం ఒక్కసారిగా కుప్పకూలింది. మొన్నటివరకూ బంగారం ధరలు అమాంతం పెరుగుతూ పోగా ఇప్పుడు రూ.2వేలకు పైగా పసిడి తగ్గింది.
3/9
ట్రంప్ ప్రకటన తర్వాత నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొద్ది రోజులు పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణలో ఈ రోజు (మే 28, 2026) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/9
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం, వెండిధరలను ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌ నగరంలో 10 గ్రామలు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,060 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.2230 తగ్గింది.
5/9
అలాగే, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,050 వద్ద కొనసాగుతోంది. ఈరోజు రూ.2050 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 24, 22 క్యారెట్ల బంగారం ధరలు ఒకే మాదిరిగా ట్రేడ్ అవుతున్నాయి.
6/9
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,060 వద్ద కొనసాగుతోంది. మే 27 (బుధవారం)తో కంపేర్ చేస్తే.. ఈరోజు రూ.2380 తగ్గింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,050గా ట్రేడ్ అవుతుండగా, ఈరోజు ఒక్కరోజే రూ.2200 వరకు పతనమైంది. కిలో వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.
7/9
అదేవిధంగా, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,180 వద్ద కొనసాగుతోంది. బుధవారంతో కంపేర్ చేస్తే.. రూ.1640 వద్ద పతనమయ్యాయి. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,45,000గా ఉండగా.. ఈరోజు రూ.1500 వద్ద క్రాష్ అయ్యాయి. బెంగళూరు నగరంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,060 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,050 వద్ద ట్రేడ్ అవుతోంది.
8/9
దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2.75 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం ఒక్కరోజే రూ.2.85 లక్షల వద్ద వెండి స్ధిరపడింది. ఈరోజు మాత్రం రూ.10 వేల మేర తగ్గింది.
9/9
హైదరాబాద్‌ నగరంలో కిలో వెండి ధర రూ.2.90 లక్షల నుంచి రూ.2.85 లక్షలకు తగ్గి ట్రేడ్ అవుతోంది. అంటే రూ.5 వేలు తగ్గింది. అలాగే, చెన్నైలో కిలో వెండి ధర రూ.2.85 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది.