Gold Silver Rate Today : భారీగా పడిపోతున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజు ఢమాల్.. రూ.లక్షకు చేరుతుందా? నిపుణులు ఏం చెప్పారంటే..

Gold Silver Rate Today : బంగారం ధర భారీగా పడిపోతోంది. బుధవారం 24క్యారెట్ల బంగారంపై రూ.5,390 తగ్గగా.. ఇవాళ (గురువారం) కూడా భారీగా తగ్గింది.

1/8
Gold Silver Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా పడిపోతోంది. బుధవారం రూ.5వేలకుపైగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ కూడా భారీ తగ్గింది.
2/8
అంతర్జాతీయంగా ముడిచమురు ధర మళ్లీ పెరగడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడ వంటి కారణాలతో బంగారం వెండి ధరలు పడిపోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇరాన్ హర్మూజ్ సంధి వద్ద రాకపోకలను నిలిపివేసింది. ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే సమీపకాలంలో బంగారం, వెండి ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో జూన్ చివరి నాటికి లేదంటే జులై నెలలో తులం బంగారం రేటు రూ.లక్షకు దిగొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
3/8
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,130 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,950 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఐదు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,077 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది. బుధవారం కిలో వెండిపై రూ. 10వేలు తగ్గగా.. ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఇలానే కొనసాగితే వెండి రేటు కూడా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,45,640 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,33,500 వద్దకు పడిపోయింది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,790 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,500వద్దకు పడిపోయింది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.