Gold Silver Price Today : ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ పిలుపు.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు..
ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు భారతీయులు బంగారం కొనవద్దని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణాలు ఎలా ఉన్నా సరే సోమవారం(Gold Silver Price Today) బంగారం ధర దిగి వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 01:50 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు భారతీయులు బంగారం కొనవద్దని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణాలు ఎలా ఉన్నా సరే సోమవారం బంగారం ధర దిగి వచ్చింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.220 తగ్గగా 100 గ్రాముల బంగారం ధర పై 2200 వరకు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర పై రూ.200 తగ్గగా, 100 గ్రాముల గోల్డ్ రేటు పై 2000 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక సిల్వర్ రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,130 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,450 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,280కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,820కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,000 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,85,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
