Gold silver Price Today : బంగారం, వెండి ధరల్లో బిగ్ ఛేంజ్.. ఎందుకిలా.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

Gold silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.

1/8
Gold silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
2/8
గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.3,500 పెరిగింది. వెండి రేటు మాత్రం బుధవారం భారీగా తగ్గగా.. ఇవాళ మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/8
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.490 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై ఆరు డాలర్లు తగ్గింది.
4/8
వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,59,930 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,46,600 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,60,230కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,46,600 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,85,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.