Gold silver Price Today : బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అయితే, సిల్వర్ రేటు పెరిగింది.
- Harish Thanniru
- Published on- May 22, 2026 / 11:23 AM IST
Gold silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 13డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,531 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి రేటు పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది. గురువారం కూడా కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.10వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో జీఎస్టీ సహా అన్ని ఛార్జీలను కలుపుకొని 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,83,988 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,68,656 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను (జీఎస్టీతో సహా అన్ని ఛార్జీలు కలుపుకొని) పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,84,161కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,68,714 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,83,988కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,68,656 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను (జీఎస్టీసహా అన్ని ఛార్జీలు కలుపుకొని) పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,40,312 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.3,28,776వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,40,312 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
