Gold Silver Price Today : బంగారం ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు..

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గురువారం గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధరసైతం భారీగా తగ్గింది.

1/7
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. సోమవారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది.. మంగళవారం మినహా.. సోమ, బుధ, గురువారాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వెండి ధరసైతం ఇవాళ భారీగా తగ్గింది.
2/7
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1200 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 35డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,706 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధర సైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై మంగళవారం రూ.5వేలు తగ్గగా.. తాజాగా. ఇవాళ రూ. 5వేలు తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,550 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,750 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,700కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,550కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,40,750 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.