Gold silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. పడిపోతున్న గోల్డ్ రేటు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..
Gold silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
- Harish Thanniru
- Published on- May 24, 2026 / 11:56 AM IST
Gold silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు క్రమంగా పడిపోతోంది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై 26 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,516 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో జీఎస్టీ సహా అన్ని ఛార్జీలను కలుపుకొని 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,83,492 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,68,195 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను (జీఎస్టీతో సహా అన్ని ఛార్జీలు కలుపుకొని) పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,83,665 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,68,368 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,83,492కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,68,195 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
