Gold silver Price Today : బంగారం ధరల్లో భారీగా మార్పు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..

Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఇవాళ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

1/6
Gold silver Price Today : అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
2/6
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.320 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్స్ గోల్డ్‌పై 38 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,554 డాలర్ల వద్దకు చేరింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో జీఎస్టీ సహా అన్ని ఛార్జీలను కలుపుకొని 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,83,861 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,68,541 వద్దకు చేరింది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను (జీఎస్టీతో సహా అన్ని ఛార్జీలు కలుపుకొని) పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,84,034 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,68,714 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,83,861కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,68,541 వద్ద కొనసాగుతుంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.