Gold Rate Today : అక్కడ.. ఇక్కడ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటుభారీగా తగ్గింది.
- Harish Thanniru
- Updated on- May 26, 2026 / 12:06 PM IST
Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటుభారీగా తగ్గింది.
పశ్చిమాసియా పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. దీని ప్రభావం బంగారం, వెండి ధరలు మీద పడుతోంది. ఇరాన్ నౌకలపై అమెరికా తాజాగా దాడులు మొదలు పెట్టడంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇంకా నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో పసిడి ధరలతో పాటు స్టాక్ మార్కెట్ కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 45డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,526 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదు. దీంతో మంగళవారం కూడా వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,58,890 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,45,650 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,040 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,650వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,95,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
