Gold Rate Today : పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ న్యూస్. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- May 29, 2026 / 11:08 AM IST
Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గోల్డ్ రేటు బిగ్ షాకిచ్చింది. గత మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం రేటు.. ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1580 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 15 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,510 డాలరల్ వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత రెండు రోజులుగా వెండి రేటు తగ్గుతూ వచ్చింది. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది. అయితే, ఇవాళ మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,57,640 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,44,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,57,790 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,44,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,57,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,44,500వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
