Gold Silver Price Today : పసిడి ప్రియులకు కీలక సమాచారం.. అక్కడ తగ్గిన గోల్డ్ రేటు.. కారణాలివే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అప్డేట్. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
- Harish Thanniru
- Updated on- June 3, 2026 / 12:03 PM IST
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అప్డేట్. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం, ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బంగారంలోని పెట్టుబడులను డాలర్ ఈల్డ్స్ వైపు మళ్లిస్తున్నారు. డాలర్ విలువ పెరుగుతుండడంతో పెట్టుబడులు అటువైపు మళ్లుతున్నాయి. దీంతో పసిడి ధరలు దిగివస్తున్నాయి.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 31డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,458 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా వెండి ధర కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,200 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,370 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,58,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,45,000వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
