Gold Silver Price Today : మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు ఢమాల్.. తులం బంగారం రేటు ఎంతంటే?

Gold Silver Price Today : ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది.

1/7
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా రెండోరోజు భారీగా తగ్గాయి.
2/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.380 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 39డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,436 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరసైతం భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది. గురువారంసైతం కిలో వెండిపై రూ.5వేలు తగ్గగా.. రెండు రోజుల్లో కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,730 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,750 వద్దకు చేరింది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,880 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,730కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,750వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.