Gold Sivler Rate Today : గోల్డ్ ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోతున్న గోల్డ్ రేటు.. వెండి ధర కూడా.. నేటి ధరలు ఇవే..
Gold Sivler Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.
- Harish Thanniru
- Published on- June 6, 2026 / 10:33 AM IST
Gold Sivler Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. వరుసగా మూడోరోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గత ఎనిమిది రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.5వేలు తగ్గింది. గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 20వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 3వేలు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 143 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,331 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా.. భారతదేశంలో కిలో వెండిపై రూ.10వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,910 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,910కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,000వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000 వద్దకు పడిపోయింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
