Gold Silver Price Today : బంగారం ధర ఢమాల్.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి కాస్త ఊరట. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. వెండి ధరసైతం తగ్గింది.

1/7
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి కాస్త ఊరట. గోల్డ్ రేటు తగ్గింది. వెండి ధరసైతం స్వల్పంగా తగ్గింది.
2/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.320 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 31డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,718 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరలో తగ్గుదల చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,880కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,680కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,950 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,74,900 వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.