Gold Silver Prices Today : కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి రేట్లు ఇవే..

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి భారీ ఊరట. గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి.

1/7
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి భారీ ఊరట. గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ.. భారత దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
2/7
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 650 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 23 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,055 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు త్గగింది.
3/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,41,980 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,150 వద్ద కొనసాగుతోంది.
4/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,130 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,41,980కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,150 వద్ద కొనసాగుతోంది.
5/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,00,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది.
6/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
7/7