Gold-Silver Prices Today : పండుగ వేళ మహిళలకు ఊరట.. తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?

Gold Silver Prices Today : పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.

1/8
Gold-Silver Prices Today : బతుకమ్మ, దసరా పండుగల వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు వరుసగా తగ్గుతోంది.
2/8
సోమవారం తులం గోల్డ్ పై రూ. 1740 తగ్గగా.. ఇవాళ కూడా తగ్గింది. రెండు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 2వేలకుపైగా తగ్గింది.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 390 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 20 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,191 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఇవాళ (మంగళవారం) మాత్రం రూ. 100 తగ్గింది. అయితే, గోల్డ్, సిల్వర్ ధరలు దసరా పండుగ నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,850 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,440 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,37,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,290కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,850 వద్ద కొనసాగుతోంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,34,900కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.