Gold-Silver Prices Today : మహిళలకు గుడ్న్యూస్.. దిగొస్తున్న గోల్డ్ రేటు.. నేడు ఎంత తగ్గిందంటే?
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వరుసగా నాల్గో రోజు గోల్డ్ రేటు తగ్గింది.
- Harish Thanniru
- Published on- October 23, 2026 / 10:06 AM IST
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు గత నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. దసరా పండుగ రోజు నుంచి బంగారం ధరలో భారీగా తగ్గుదల చోటు చేసుకోవటంతో మహిళలు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో తులంపై సుమారు రూ. 4వేలు తగ్గుదుల చోటు చేసుకుంది. ఈ నెలాఖరు నాటికి తులం బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1900 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1750 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై సుమారు 20 డాలర్లు తగ్గడంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,006 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,480 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,600 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,630 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,480కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,25,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,20,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,25,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
