Gold-Silver Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. గోల్డ్ రేట్లలో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold-Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
- Harish Thanniru
- Updated on- October 3, 2026 / 09:58 AM IST
Gold-Silver Prices Today : దసరా పండుగ వేళ గోల్డ్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న మహిళలకు శుభవార్త. ఇవాళ బంగారం రేటు భారీగా తగ్గింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1100 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,285 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,330 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,180కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు
